1
మండితంబగు పునాది
సూర్యకాంతపు రాయి
రెండవది నీలము
మూడవది యమునా రాయి ||పరలోక||
2
పచ్చ వైఢూర్యము
కెంపు సువర్ణము
అచ్చ గోమేధికము
పుష్య రాగము తోడ ||పరలోక||
3
పదియవది సూనియము
పదకొండు పద్మరాగము
పండ్రెండు సుగంధము
పండ్రెండు ముత్యములు ||పరలోక||
4
శుద్ధ సువర్ణ వీధుల్‌
స్వచ్ఛమైన స్ఫటికము
సుందరముగా నుండు
సిద్ధపడిరండి ||పరలోక||
5
గొఱ్ఱెపిల్ల దీపం
సూర్యుడక్కరలేదు
భూరాజుల్‌ తమ మహిమన్‌
తీసికొని వచ్చెదరు ||పరలోక||
6
జీవజలముల నది
ప్రవహించు చుండెను
జీవంబు గల్గును
జీవించుదురు ప్రజలు ||పరలోక||
7
ఇరుప్రక్కల నదికి
జీవ వృక్షముండె
పండ్రెండు నెలలకు
పండ్రెండు కాపులు కాయు ||పరలోక||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)