1
మాయలోకమాయలోనేల
మున్గి తిరిగెదవు కాయము
నిన్ను మోసము చేయు
కాలమాయెను
మరణమువచ్చున్‌
మరణము వచ్చున్‌
లోకము ముగియున్‌
మానవులకు కృపకాలము
దాటిపోవును
2
పాతాళము నిన్ను మ్రింగ
కాచి నిల్చెను
ప్రాణనాథుడేసు నిన్ను
రక్షింప వచ్చెను ||మరణ||
3
వేద వాక్యము మారక
పూర్తియగును దేవకోపము
మానవులపై పోయబడును ||మరణ||
4
లోకము దిగుల్‌
కలహములతో తత్తరిల్లును
మేఘమందు యేసురాజు
కనిపించును ||మరణ||
5
యేసు నేనే మార్గము సత్యము
జీవము నేనే
మోసపోకు డెందుమార్గము
వేరే లే దనెను ||మరణ||
6
పాపికై మరణించిన యేసు
కాచి నిల్చెను
పాపి నిన్ను పిలుచుచున్నాడు
చెంత చేరుమా ||మరణ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)