1
పరిశుద్ధులుహర్షింప యేసు
త్వరగా రమ్మని పలుక
మారువారికి శిఖరం
మనస్సారగ దేవుడిచ్చున్‌
మహిమ ఘనము మహిమలో
నానందింప ||యేసులో||
2
శుద్ధ జీవులైన
దేవసుతులు ప్రకాశింపన్‌
సర్వసృష్టి యొక్క
మహకర్మములన్నియు తీర
రాజుకు మహిమ
కలుగుదినములు రాగా ||యేసులో||
3
స్ఫటిక జీవనదియు
ఇరుప్రక్కల జీవ వృక్షమును
ఆకలిదప్పులు లేక
నట జీవఫలముల భుజించి
తినుచు త్రాగుచు
యేసులో నానందింప ||యేసులో||
4
పరిశుద్ధాత్మయు, సుతుడు చేసిన
రక్షణ కార్యమును
తండ్రి దూతల గణముల్‌ నట జూచి
ప్రహర్షింపన్‌ క్రొత ్తకార్యము
కొరకు ఆనందింప ||యేసులో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)