1
చిత్ర వస్తువులు-చెల్లెడి యొక
వి-చిత్రమైన సంత-లోకము ||పర||
2
సంత గొల్లు క్షమ-సడలిన చందం
బంతయు సద్దణగున్‌ నిజముగ ||పర||
3
మాయలోక మిది-ఛాయను బోలును
మాయ మాయ మాయ-అంతయు
4
స్థిరమని నమ్మకు-ధర యెవ్వరికిని
పరలోకమె స్థిరము-నిజముగ ||పర||
5
మేడలు మిద్దెలు-మేలగు సరకులు
పాడై కనబడవే-నిజముగ ||పర||
6
ధనధాన్యంబులు-దరగక మానవు
పనిపాటులు పోయె నిజముగ ||పర||
7
వచ్చితి మిచటికి-వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లేదు గదా ||పర||
8
ఎట్లు వచ్చితిమి-యీ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్‌-మింటికి ||పర||
9
యేసు నందు వి-శ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్‌-బరమున ||పర||
1
యేసే మార్గము-యేసే సత్యము
యేసే జీవముగా-నిజముగ ||పర||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)