1
నిన్నుగన్న తండ్రి యేడి
నిన్ను గన్న తల్లి యేది
పోయినార పోయినారా
నిన్ను విడిచి పోయినారా ||గనుక||
2
నీ అక్కలేరి చెల్లెండ్లేరి
నీ అన్నలేరి తమ్ముండ్లేరి
వారాశతో సంపాదించిన
వారాస్థి పాస్తులన్ని ఏవి ||గనుక||
3
ధనము సంపాదించేవారు
ఈ ధరణియందు నిలువబోరు
వారు పామునోట కప్పవలె
సాగిపోదురు సమాధికి ||గనుక||
4
నీవు వచ్చేటప్పుడు తేలేదుగా
నీవు వెళ్ళేటప్పుడు మోయలేవుగా
నీవు ఒంటరిగానే వచ్చినావు
నీవు ఒంటరిగానే వెళ్లవలెను ||గనుక||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)