1
నీ తల్లి గర్భమున నీ వుండినపుడే
నిను చూచె ప్రభు కన్నులు
యోచించినావా ఏ రీతి నిన్ను
నిర్మించె తన చేతులు ||నీ||
2
నీలోన తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను
హృదయంబు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను ||నీ||
3
తన చేతులందు రుధిరంపు ధారల్‌
స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీ కోసమేగా
ఒకసారి గమనించవా ||నీ||
4
ప్రభుయేసు నిన్ను సంధించునట్టి
సమయంబు ఈనాడెగా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ ||నీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)