1
నరకమనునది-నిరంతముండునయో
ఆ ఘోర నరకము-నందు పాపులు
బాధపడుదురయో మరియు నగ్ని
పురుగులందున-కొరుకుచుండును
తరుగులేకను ధరణికాదిది దరియుకాదు
మరణమెదికిన దొరకదందున
2
గప్పుగప్పున రగులుచుండునయ్యో
ఆ ఘోరనరకము నిప్పులెగయుచు
పొంగుచుండునయ్యో
మబ్బువలె పొగ పైకి లేచును-
అబ్బ! అబ్బని యేడ్చుచుందురు
బొబ్బలిడుదురు అడ్డమొచ్చెడి
అబ్బలెవ్వరు కానరందున ||నరక||
3
నోరు నెత్తి కొట్టుకొందురయ్యో
ప్రభు యేసు క్రీస్తును
నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో
పురుగు చావదు అగ్ని ఆరదు
కొరుకుచుందురు-పండ్లు పటపట
తిరిగితిరిగి చూచుచుందురు-
పరుగులెత్తక యేడ్చు చుందురు ||నరక||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)