1
ఎక్కడి కోయీ యాత్ర పోయేది
నీ యిల్లు స్థిరముగాదు
నీ ఒళ్ళు మరిచెదవు
నీ వచ్చిన దారినే
వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి ||రేయి||
2
యేసయ్య దారిలో ఎడారిలేదు
ఇరుకైన దారిలోన బరువైన కాడితోను
ప్రార్థన ఖడ్గముతోను
బయలుదేరాలి, ప్రభుని చేరాలి ||రేయి||
3
బానిస పిల్ల మాటలు నమ్మి
అన్యుడైన నయమాను
అప్పుడె మార్పు నొందేనోయి
లోకాశ గేహాజికి లోటు తెచ్చెనోయి
గొప్ప కుష్టు తెచ్చెనోయి ||రేయి||
4
సొదొమ, గొమొఱ్ఱా చోద్యము చూడ
లోతు భార్య ఆనాడు
లోకాశకు లోబడి ఊరి వెలుపల
ఉప్పు స్థంభమాయె
గొప్ప స్థంభమాయె ||రేయి||
5
కయ్యమునకై కాలు దువ్వుచు
గొల్యాతను శూరుడు ఆరుమూర్ల జానెడు
దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయె
చెక్కముక్కలాయె ||రేయి||
6
నోవహు ఓడ నేటికి జూడ
నమ్మిన వారేమైనారో
నమ్మని వారేమైనారో
ఆనాటి సాక్ష్యము
అక్కడే ఉన్నది, కనబడుచున్నది ||రేయి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)