1
నీదు రాజు నీతితో
దోషమేమియు లేకయె
పాపరహితుడు ప్రభు వచ్చుచుండె
2
రక్షణ గల వాడుగ
అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండె
3
సాత్వికుండు ఈ భువిన్‌
అత్యంత మగు ప్రేమతో
నిత్య రాజు నరులకై వచ్చుచుండె
4
దీనపరుడు నీ ప్రభు
ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె
5
ఇలను గాడిదనెక్కియే
బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు వచ్చుచుండె
6
దావీదు కుమారుడు
దేవుడు పాపులకు
జయగీతములతో వచ్చుచుండె
7
యేసుని ప్రేమించుచు
హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)