1
ఖెరుబులు సెరుపులు
మరి దూతగణములు
నురుతరంబుగఁగొలువ
నొప్పు శ్రేష్టుడ వీవు ||కొని||
2
సర్వలోకంబులం-బర్వు
దేవుడ వయ్యు
నుర్వి స్త్రీగర్భాన
నుద్భవించితివి వీవు ||కొని||
3
విశ్వమంతయు నేలు
వీరాసనుఁడవయ్యు
పశ్వాళితో దొట్టి
పడియుంటివి నీవు ||కొని||
4
దోసంబులను మడియు
దాసాళిగరుణించి
యేసు పేరున జగతి
కేగుదెంచితి నీవు ||కొని||
5
నరులయందున గరుణ
ధర సమాధానంబు
చిరకాలమును మహిమ
పరఁగఁ జేయుదు వీవు ||కొని||
6
ఓ యేసు పాన్పుగ
నాయాత్మ జేకొని
శ్రేయముగ బవళించు
శ్రీ కర వరసుత ||కొని||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)