1
ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా (2)
రోగముతో, కృశియించగా
నను చేర్చుకొనలేదు నీ వెందుకు?
అని యేసు నిన్నడిగిన-యేమందువు
2
గొఱ్ఱెలనే నీతిమంతులు
మేకలనే పాపాత్ములు (2)
మందలుగా విభజించగా
ఏ వైపున నీవు నిలిచి యుందువు?
అని యేసు నిన్నడిగిన-యేమందువు?
3
గొఱ్ఱెలకు నిత్య జీవము
మేకలకు నిత్య నరకము
ప్రతిఫలముగా నీకొసగునుగా
ఈ రెంటిలో ఏది నీ స్థానము?
అని యేసు నిన్నడిగిన-యేమందువు

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)