1
ఎండిపోయే గడ్డివంటా
రాలిపోయే పూవువంటా
చేద నుండి జారే బిందువంటా
సాగిపోయే నీడవంటా
త్రాసు మీద ధూళివంటా
మానవా పగిలి మట్టి కుండవంటా ||ఓ||
2
నీ జీవము కొంత సేపు కనబడే
అంతలోన మాయమై పోయెను
ఆవిరివంటా ఎగిరి పోదుమా
కానరాని దుమ్మువంటా
నీ జీవితం మాయరా మానవా
నీ బ్రతుకే మాయరా ఓ మానవా ||ఓ||
3
నీలో ఉన్న ఆత్మ మంట
దేవుడు పెట్టిన దీపమంటా
ఆ దీపము ఆరిపోయినా
మరలా మండదురా ఏనాడైనా
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు
ప్రభుని నమ్ముకో యేసయ్యను
నమ్ముకోరా మానవా పరలోకం చేరుకోరా
మానవా... మానవా...

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)