1
మానవులెంతో చెడిపోయిరీ
మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరూ ||చూడు||
2
ఇహమందు నీకు కలవన్నియు
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగుము
ఒక దినమున ||చూడు||
3
మనలను ధనవంతులుగ చేయను
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసుని ||చూడు||
4
సిలువపై చూడుము ఆ ప్రియుని
ఆ ప్రేమకై నీవేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవించుము ||చూడు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)