1
పరలోక పెద్దలతో
పరివారముతో కదిలి
ధర సంఘ వధువునకై
తరలెను వరుడదిగో ||గగ||
2
మొదటను గొఱ్ఱెగను
ముదమారగ వచ్చెను
కొదమసింహపు రీతి
కదిలెను ఘర్జనతో ||గగ||
3
కనిపెట్టు భక్తాళి
కనురెప్పలో మారెదరు
ప్రధమమున లేచెదరు
పరిశుద్ధులగు మృతులు ||గగ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)