1
ఎంత ఆనందము - ఎంత ఆనందము
చెప్ప శక్యమా ?
రాజైన క్రీస్తు నా పాపంబులన్నియు
మన్నించి వేసెగా
2
పాడెదం - ఆడెదం - కూడెదం మేము
జయమార్భాటింతుము
పాపము మన్నించి - జీవము నిచ్చిన
యేసుని - స్తుతించెదం
3
పాపము - కోపము -శాపములన్నియు
పరిహరించెను
దేవాది దేవా ! నా యెదలో కేతెంచి
ఆదరణ నిచ్చెన్‌
4
అక్షయమైన రక్షణతో - తన పక్షము
చేర్చెను
నిశ్చయముగను - సాక్షులైయుండి
యేసుని - చాటింతుము
5
ధవళ వస్త్రము - బంగరు మకుటం
వాద్యముల తోను
ఇహము కేతెంచి - పరము చేరిన
రాజును - స్తుతింతుము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)