1
కన్య మరియ సుతుడై
పశువుల తొట్టిలో పరుండెను (3)
పశువుల పాకలో బాలయేసుని
స్తుతియించి పూజించి కీర్తించెదను||స్తో||
2
జ్ఞానులు వెదకిరి
సర్వోన్నత జ్ఞానమూర్తిని (3)
ఆకాశవీధిని సింహాసనాసీనున్‌
ప్రేమాస్వరూపిని ఆరాధించిరి ||స్తో||
3
పొత్తిగుడ్డలతోడ
చుట్టబడినట్టి రక్షకుని (3)
దూతలు ఆరాధించిరి
గొల్లలు వచ్చిరి మహిమను చూచిరి
ఆరాధించిరి సంతోషించిరి ||స్తో||
4
పాపుల కొరకై
వచ్చిన పాపనాశకుడు (3)
ఇదిగో లోకపు పాపము మోసిన
రక్షకుడైన దేవుని గొఱ్ఱెపిల్ల ||స్తో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)