1
త్రోవ తప్పి తిరుగుచుంటిని
ఆ త్రోవలోనే పడిపోతిని
అయినన్‌ యేసు కరుణించెన్‌
తానె నన్ను రక్షించెన్‌(2)
ఇంత వరకు కాచినాడు
మంచి యేసుడే ||సంతోషం||
2
దేవుని సెలవు పొంది
సాతాను శోధించును
అయినన్‌ యేసు విడువడు
తానె వచ్చి రక్షించును (2)
ఇంత మంచి యేసు నాకు
స్వంతమాయెను ||సంతోషం||
3
మారుమనసు లేని ప్రజలు
పాతాళ మందు ప్రలాపింతురు
నేను పరమందున
క్రొత్త గీతం పాడెదన్‌
నాలోనున్న యేసుతో
నిరంతరముందును ||సంతోషం||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)