1
పాపమంత పోయెను - రోగమంతా
తొలగెను-యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం-కృపద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో ||కుతూ||
2
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె
దేవాలయం నేను
ఆత్మలోన దేవుడు గుర్తించె నన్ను
అద్భుత మద్భుతమే ||కుతూ||
3
శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు
జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి హోసన్నా పాడి
ఊరంతా చాటెదము ||కుతూ||
4
బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు
రానై యుండే ఒక్క క్షణములోనే
రూపాంతరము పొంది
మహిమలో ప్రవేశిద్దాం ||కుతూ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)