1
పనికి రాని పాత్రననీ-పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగచేసి-నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ
శ్రీ యేసునే పొగడుచుండ
సాక్షిగ నుండు పాత్రగ జేసి
సత్యముతో నింపుము తండ్రీ ||కుమ్మరీ||
2
విలువలేని పాత్రను నేను
కొనువారు లేరెవ్వరూ
వెలలేని నీదు రక్తంబుతో
వెలుగొందు పాత్రగ జేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను
ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను
సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరీ||
3
లోకాశలతో నిండి ఉప్పొంగుచు
మార్గంబు నే తప్పితిన్‌
మనుషేచ్ఛలన్నియును స్థిరమనుచునే
మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్ర యనుచు
పరుగెత్తి నిను పట్టితి
ప్రాణంబు నాలో నున్నప్పుడే
నీ పాదంబుల్‌ నే బట్టితిన్‌ ||కుమ్మరీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)