1
ఏలీయా దేవుడు మన దేవుడు
బలమైన దేవుడు మన దేవుడు (2)
దాసుల యొక్క మొఱలు విని
పరాక్రమకార్యముల్‌ చేయువాడు(2)
యెహోవాయే దేవుడు (2)
యంచు ఆర్భాటింతుం
యెహోవాయే దేవుడు (2)
యంచు ఆర్భాటింతుము
2
వేడుచుండు భక్తుల మొఱను విని
వడగండ్లనాపిన గొప్ప దేవుడు
కరువులోను విధవ యింట
పాత్రలను ఆయనాశీర్వదించెన్‌
3
గగనము తెరచిన గొప్ప దేవుడు
అగ్నితోను బదులిచ్చెన్‌ జీవదేవుడు
ఆ ప్రభువే దేవుడంచును
సాగిలపడిరి దైవప్రజలు

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)