1
ఇమ్ము నీ హృదయము కానుకగా నేడే
రమ్ము రక్షణ వస్త్రము ధరియించుము
కుమ్మరించును విమలాత్మ వరమ్మును
నమ్మి ప్రార్థించు నేడే ||ఏది||
2
పాపుల కొరకై ప్రాణము బెట్టితి
శాపము బాపి నీకు జీవము నిచ్చితి
3
చింతలు దీర్చితి భ్రాంతిని మార్చితి
చెంతను జేర్చి నీ శాంతిని గూర్చితి
4
భావము నందున భక్తిని గూర్చితి
జీవ జలంబుల ద్రావుటకిచ్చితి
5
రక్తము గార్చి విముక్తుల జేసితి
రక్షణ పాపికి దెచ్చి నే నిచ్చితి
6
దీన దయాపరుడా నీకేమిత్తును
దీనుల రక్షక నేనేమి దెత్తును
గైకొనుమా నా యావజ్జీవము
గొనుమిదె కానుకగా ||ఏది||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)