1
యుద్ధములు కలహములు వైరములు
నిందలు హింసలు అపవాదులు
అంతము వరకు సూచనలివియే
మేల్కొని యుండుము ||ఇది||
2
అక్రమము అవినీతి-ప్రబలును
అందరి ప్రేమలు చల్లారును
అంతము వరకు కాపాడు కొమ్ము
మొదటి ప్రేమను ||ఇది||
3
చిగురించుచున్నది అంజూరము
ఏతెంచియున్నది వసంతము
ఉరి యొచ్చునట్లు అందరిపైకి
అంతము వచ్చును ||ఇది||
4
ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు
మత్తును చింతను వీడుము
విశ్వాస ప్రేమ నిరీక్షణల్‌
ధరించియుండుము ||ఇది||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)