1
అన్ని నామములకు పైన గలదు
ఉన్నతంబగు యేసు నామము
యేసు నామములో శక్తిగలదు(2)
దుష్టులకు శాశ్వత ముక్తిగలదు(2) ||పై||
2
యేసు నామము స్మరియించగానే
మనసు మారి నూతన మగును
భేదమేమియు-లేదెవ్వరికిని (2)
నాథుని స్మరియింప తరింప (2) ||పై||
3
యేసు నామములో శక్తిగలదు
శాశ్వతానంద శాశ్వత శాంతము
యేసు నామములో-రోగశుద్ధి (2)
విశ్వసించిన-మోక్ష సమృద్ధి(2) ||పై||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)