1
ధరలోన ధనధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాథుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా
2
పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా
3
వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా
వెలిగించ ధరపైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభునకర్పించవా
4
కలిగించె సకలంబు సమృద్ధిగా
తొలగించె పలు బాధ భరితంబులు
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)