1
నేను నమ్మిన వారిలో
కొందరు మోసం చేశారు
వెళతామని చెప్పి
వెనుకకు తిరిగారు
మీరైనా-మీలో ఒకరైనా
వెళతారా-నా ప్రేమను చెబుతారా ||నా||
2
రక్షణ పొందని ప్రజలు
లక్షల కొలదిగా వున్నారు
మారు మూల గ్రామాలలో
ఊరి లోపలి వీధుల్లో
ఎవరైనా-మీలో-ఎవరైనా
వెళతారా నా ప్రేమను చెబుతారా ||నా||
3
వెళ్ళ గలిగితే మీరు
తప్పక వెళ్ళండి
వెళ్ళలేక పోతే
వెళ్ళే వారిని పంపండి
ఎవరైనా-మీలో-ఒకరైనా
వెళతారా-నా ప్రేమను చెబుతారా ||నా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)