1
రాణి ఓఫిరు అపరంజితో
స్వర్ణవివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో
ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనందతైల సుగంధాభిషేకము
పొందితివే యేసునందు
2
క్రీస్తే నిన్ను ప్రేమించెనని
తన ప్రాణమునర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా
ముడత కళంకములేనిదిగా
మహిమయుక్తంబుగా
నిలుప గోరె యేసువా
సహింతువా తీర్పునాడు ||ఓ||
3
చీకటిలో నుండి వెలుగునకు
లోకంలో నుండి వెలుపలకు
శ్రీ కర్త గుణాతిశయములను
ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించు చుంటివా
క్రియలను గంటివా
సజీవముగా నున్నావా ||ఓ||
4
చల్లగానైన వెచ్చగాను
నుండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన
బయటకు ఉమ్మివేయబడుదువేమో
నీ మనస్సు మార్పుకో
తొలి ప్రేమ కూర్చుకో
ఆసక్తితో రక్షణ పొందుమా ||ఓ||
5
కడపటి బూర మ్రోగగానే
కనురెప్ప పాటున మారెదవా
వడిగ మేఘాసీనుడవై
నడియాకాశము పోగలవా
గొఱ్ఱెపిల్ల సంఘమా
క్రీస్తు రాజు సంఘమా
రారాజు నెదుర్కొనగలవా ||ఓ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)