1
విజయముగా బ్రతుకను వృజినమున
నిజదైవము నిను సృజి యించెనుగా
జారితివే వేసారితివే - వెనుకాడియు
వేషము విడువవా ||ఓహో||
2
సాతానుని ఒడిలో నిదురించి
సర్వేశుని బోధలు ఎదిరించి
మానసము మసిగారినను
మలినమును మలుపగలేవా ||ఓహో||
3
గద్దించెడు మనస్సాక్షిని ద్రోసి
ఘనదేవుని మార్గములను రోసి
దాస్యమను ధనమోహమును
దాహముతో త్రాగెదవేమి? ||ఓహో||
4
ఆత్మలో ఆనందము అణగారి
ఆవేశము లేకను దిగజారి
అన్నిటిలో నే నధికుడ ననుచు
ఆర్భాటము చేసెదవేమి? ||ఓహో||
5
ఎన్నో మేలులు తరుణములు
యేసుడు నీకివ్వగ కరుణించి
తామసము మరి జేయుదువా
తండ్రి కౌగిలి జేరవా ||ఓహో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)