1
శ్రీయేసుయొక్కరాకడ
ఎంతో సమీపము
ఈ ప్రొద్దొరేపొ యాకడ
దినంబు వచ్చును
మేఘాసనంబు నెక్కి
తానా నాడు వచ్చును
యావత్తు సృష్టి బొత్తిగా
వినాశ మొందును
హా!య దెంతయో యఘోరము
యాదెంతమోసు మోదము
దుర్మార్గికేయ ఘోరము
విశ్వాసి మోదము
2
దాదాపు గుఱుతులన్నియు
నీడేరియున్నవి
ఆ చివరి గుఱుతుకూడను
ఈడేరనైనది
ఇంకేమి యడ్డులేదిక
నొకడ్డుయున్నది
శ్రీ క్రీస్తు స్వామి వేడు-చే
నిల్చి యున్నది ||హా||
3
ఆకాశమో ధ్వనించుచు
గతించిపోవును
భూతాదులన్ని రగులుచు
గరంగి పోవును
ఈ భూమి నిందు నుండెడి
ఈ యెల్ల పనులును
దహించిపోవు నగ్నిని సమూలమైనను ||హా||
4
మృతుల్‌ సజీవులేకమై
బల్‌స్తోమమౌదురు
విశిష్టల్దుష్టులందుపై విభాగమౌదురు
ఆ వేళ నీవు నేనును
ఆ గొప్పగుంపునన్‌
నిల్చుందుమైనదేనిలో
నుండెదము తెలియునా ||హా||
5
ఆవేళ యేసునాథుడు
ఆ గొప్ప గుంపుకే
న్యాయంపు దీర్పుచేయును
నిత్యంబు నుంటకే
శిష్టాళికెల్ల నా ప్రభు
డొసంగు మోక్షము
దుష్టాళికెల్లనప్పుడు విధించునరకము ||హా||
6
ఆవేదన స్థలానకు నేదప్పునట్లుగా
నీయందె నిల్చి యుండుటకు
నన్‌ గావు రక్షకా!
హా! ఘోరమౌనఘోరమే
మహా యఘోరమౌ
నిన్‌ నమ్మి విడ్చు ద్రోహికే
మహా యఘోరమౌ ||హా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)