1
అన్ని కాలములలో నీ నామము
మహోన్నతంబౌ - మహోన్నతుండ
వాగ్దానము నెరవేర్చిన దేవ
మాట తప్పని మహోపకారి ||జైౖ||
2
దూతల మాదిరి గీతముల్‌ పాడుచు
సతతము నిన్నే స్తోత్రించెదము
గొల్లలు గాంచిన ఘన కాపరి మా
ఉల్లములందు ఉల్లసించెదము ||జైౖ||
3
తూర్పున తారను గాంచిన జ్ఞానులు
రాజుల రాజ నీవే యనుచు
బంగారము సాంబ్రాణి బోళమును
అర్పించి ఆరాధించిరిగా ||జైై||
4
ధనవంతుడ వగు ఓ మా ప్రభువా
ధనహీనుడుగా నైతివ మాకై - మా
దారిద్య్రము తీసివేయ
నరరూపమున - జన్మించితివా ||జై||
5
యేసు ప్రభుండ రక్తము కార్చి
ఎంచి మమ్ము విమోచించితివా
ఎంచలేము నీ మేలుల నెపుడు
ఎన్నదగిన మా దేవుడ వీవె ||జైౖ||
6
మాకై సిలువలో మరణించితివా
మరణపు ముల్లును విరచిన ప్రభువా
యుగయుగములకు నీకె మహిమ
నిరతము స్తోత్రము హల్లెలూయ ||జైౖ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)