1
వ్యర్ధుడవై - నాశనంబౌ
నిన్ను రక్షించి మోక్ష నగరు చేర్చను
తనదు ప్రాణమిచ్చెనె
ఓ నా మనసా ఎంతటిప్రేమ
దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||
2
ప్రియులు లేక - భ్రమసి నీవు
పరుడవైనపుడు - ప్రియుడేసు
నిన్ను చేరి - సంతసంబిడెనె
సమర్పించు - సర్వము తనకై
దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||
3
రక్షణాలం - కార వస్త్రము
జీవాహారము - శాంతి
సమాధానము నీతి - నీకు నిచ్చెనె
ప్రేమ పరిమళ స్తుతులను పాడి
దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||
4
గెత్సెమనెలో కార్చెనేసు
రక్త చెమటలను - వేదనతో
విజ్ఞాపనము - నీ కొరకు జేసెన్‌
వినుమా మనసా - ఏడ్చెను నీకై
దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||
5
వస్తాననిన - కాలమాయె
తామసంబేల - ప్రభుని రాక
బూర ధ్వనించు - కాలమెప్పుడో
ఆశతో ప్రభుని - రాకను కోరి
దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)