1
గవ్వ చేయరాని చెడ్డ
కర్మేంద్రియాధీనుడనై
రవ్వపాలైనేనెంతో నెవ్వబొందితిఁ
త్రవ్వుచున్న కొలదిఁ పెరుఁగుఁ
దరగదు నా పాప రాశి
యివ్విధమునఁ జెడిపోతినినే
నేమి సేతు నోహో హోహో ||త్రాహి||
2
నీ యందు భయభక్తులు లేని -
నిర్లజ్జాచిత్తముఁబూని
చేయరాని దుష్కర్మముల - చేసినాఁడను
దయ్యాలరాజు చేతిలోఁ
జేయివేసి వాని పనులఁజేయసాగినే
నిబ్బంగి - జెడిపోయితినే
నయ్యయ్యయ్యొ ||త్రాహి||
3
నిబ్బర మొక్కించుకైన
నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుటకు ము-త్తాత నైతిని
అబ్బురమైన ఘోర పా-పాంధకార
కూపమందు
దబ్బున బడిపోతినయ్యో
దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||
4
నిన్నుఁజేరి సాటిలేని నిత్యానంద
మందఁబోవు చున్నప్పుడు
నిందలు నా -కెన్ని చేరినా
విన్నదము లేకుండ
నీవే నా మదికి ధైర్యమిచ్చియన్నిట
రక్షించితివి నా
యన్న నీకు స్తోత్రమహహా ||త్రాహి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)