1
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభదినము
మేమందరము ఉత్సహించి
సంతోషించెదము
కొనియాడెదము మరువ బడని
మేలులు చేసెనని ||స్తుతి||
2
నీ ఒక్కడవే గొప్ప దేవుడవు
ఘన కార్యములు చేయుదువు
నీదు కృపయే నిరంతరము
నిలిచి యుండునుగా
నిన్ను మేము ఆనందముతో
ఆరాదించెదము ||స్తుతి||
3
నూతనముగ దినదినము నిలుచు
నీదు వాత్సల్యత మాపై
ఖ్యాతిగా నిలిచే నీ నామమును
కీర్తించెద మిప్పుడు
ప్రీతితో మాస్తుతులర్పించెదము
దాక్షిణ్యా ప్రభువా ||స్తుతి||
4
నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి
జీవమునిచ్చి నడిపించెదవు
నీ ఆత్మ ద్వారా
సేవించెదము సమభూమిగల
ప్రదేశములలో నిను ||స్తుతి||
5
భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితి వన్ని మా కొరకై
మరణము గెలిచి ఓడించితివి
సాతాను బలమున్‌
పరము నుండి మాకై వచ్చె
ప్రభు యేసు జయమున్‌ ||స్తుతి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)