1
ప్రతిక్షణం స్తుతియించెద
ప్రభుయేసు ప్రేమ ఘనత
ప్రతి దినము కొనియాడెద
ప్రభు యేసు దివ్యచరిత
ప్రతి నోట పాడాలి
ఒక చక్కని తియ్యనిపాట
ప్రతి చోట పాడాలి
ప్రభుమేలుల గూర్చి
ఓ...దేవ మహాదేవ-నీకె స్తోత్రము
సంపూర్ణ హృదయంతో
ధ్యానించెదం
ఓ దేవ మహరాజ-నీకే చెల్లును ||ప్రతి||
2
మరణదూత మమ్ములను
వెంటాడగా దరిచేర కరముచాచి
కాపాడిన దేవా
మా బ్రతుకుల జీవమిచ్చి
బ్రతికించగా స్తుతి
నీకె అర్పింతుము
3
మనుజునిగ అరుదెంచిన
మహిమతేజుడా కొనియాడ
తరముగాదు
నీదు ప్రేమను మా రక్షణకై నీదు
రక్తమిచ్చినావు
స్తుతి నీకె అర్పింతుము

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)