1
సర్వ సమయములలో
నీ స్తుతిగానం ఎల్ల వేళలయందు
నీ నామ ధ్యానం మాదియే మేలు
ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా ||జీవిత||
2
సృష్టినంతటిని నీ మాటచేత
సృజియించితివిగా మా దేవదేవా
నీ ఘనమగు మహిమన్‌
వర్ణింపతరమా
స్తుతియింతు నా రక్షకా ||జీవిత||
3
కలుషాత్ములమైన మా కొరకు
నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కల్వరిగిరిపై చూపిన ప్రేమన్‌
స్తుతియింతు నా రక్షకా ||జీవిత||
4
పరిశుద్ధమైన నీ సన్నిధిలో
శాశ్వతమైన నీ రాజ్యంబులో
ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా
స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)