1
లోకంలో ఎన్నెన్నో దేవతలున్నా
మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా
ఈ లోకమంతటికి దేవుడొక్కడే
ఆ దేవుడు క్రీస్తై యున్నాడు
2
మనమంతా చేసిన పాపము కోసం
తన స్వంత ప్రాణాన్ని అర్పించాడు
మృత్యుంజయుడై లేచి వచ్చెను
మరణించిన వారిని తిరిగి లేపెను
3
యేసయ్యా అందరికి మంచి కాపరి
లోకమంత ఏకమై చాటించాలి
రెండవ సారి రానై యున్నాడు
సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)