1
కాపరి - నన్‌ మేపును
కాపుదల నిచ్చును
భావశుద్ధి - భాగ్యమొసగు
రక్షకుండేసుడే ||సర్వ||
2
తల్లిదండ్రుల్‌-సోదరుల్‌
సర్వము నాకేసువే
బంధువర్గం - మిత్రులు
సంపూర్ణ భాగ్యమేసువే ||సర్వ||
3
దుఃఖములో - ఆదరణ
చీకటిలో జ్యోతియు
అన్ని వ్యాధి బాధల్‌ మాన్పు
చెంతనుండు ఔషధం ||సర్వ||
4
బోధకుండు - సాధకుండు
యేసుడు నా నాథుడే
రాకపోకలందు నాకు
తోడుగుండు మిత్రుడే ||సర్వ||
5
అందము - సుగంధము
ఆస్థియు నా స్వాస్థ్యము
విమోచించి-హత్తుకొను
ప్రియ మధ్య వర్తియే ||సర్వ||
6
జీవాహార మయ్యెను
వాంఛలన్ని తీర్చును
జ్ఞానము - నిరీక్షణయు
అంతులే నానందము ||సర్వ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)