1
నీదు ప్రేమే నాకు జీవము
నా సమస్తమును
వర్ణించగలనా నీదు ప్రేమ
ప్రాణ ప్రియుడా ||నా||
2
నీవు పొందిన శ్రమలన్నియును
నాదు డెందములో
సాక్ష్యమిచ్చు చుండ నేను
నిన్ను విడతునా ||నా||
3
నీవు కార్చిన రక్తమే నా
ముక్తి మార్గమై
సిల్వలో స్రవించుచునన్‌
శుద్ధి చేయును ||నా||
4
అర్పింతు నేను నా సమస్తము
నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందర
చేయుచున్నది ||నా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)