1
పాపుల నందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన
ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరచి
విజయము నిచ్చెనుగా ||ఇదియే||
2
రాజులకు రాజైన యేసు
రానై యున్నాడు
గురుతులు జరిగెనుగా
మీరు సరిగా చూడండి
తరుణముండగానే మీరు
తయ్యారవ్వండి ||ఇదియే||
3
బుద్ధిలేని కన్యకల వలె
మొద్దులుగా నుంటే
సిద్దెలతో నూనె
మీరు సిద్ధపడక పోతే
ద్వారము మూయగనే మీకు
దారి దొరకదేమో ||ఇదియే||
4
వెలుపల నుంటేను
మీరు వేదన నొందెదరు
తలుపు తట్టినను
మీకు తెరువడు సుమ్మండి
మిమ్మును ఎరుగనూ
మీరు ఎవరో పొమ్మనును ||ఇదియే||
5
నమ్మిన వారికి క్రీస్తు
నెమ్మది నిచ్చునుగా
నమ్మని వారికి
నిత్య నరకమె సుమ్మండి
నిర్లక్ష్యము చేయకను రండి
రక్షణ నొందండి ||ఇదియే||
6
సందియ పడకండి
మీరు సాకులు చెప్పకను
తరుణముండగానే
మీరు త్వరపడి రారండి
మరణమెప్పుడొచ్చున్‌ మనకు
తెలియదు సుమ్మండి ||ఇదియే||
7
జాలము చేయకను
మీరు హేళన చేయకను
కులము స్థలమనుచు
మీరు కాలము గడుపకను
హల్లెలూయ పాటలు బాడ
నెల్లరును రండి ||ఇదియే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)