1
తల్లిదండ్రుల ప్రేమ
నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ
కలలా కరిగిపోవును
ఎన్నడెన్నడు మారనిది
నా యేసుని నిత్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది
నా యేసుని దివ్య ప్రేమ ||ప్రేమ||
2
భార్యభర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో
మోడులా మిగిలిపోవును ||ఎన్న||
3
బంధు మిత్రులయందు
వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంతకాలమే
వెలుగు నిచ్చి ఆరిపోవును ||ఎన్న||
4
ధరలోని ప్రేమలన్నియు
స్థిరముకావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ
కడవరకు ఆదరించును ||ఎన్న||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)