1
పాపాత్ము లనబడు వారి
భారంబు దీయను గోరి
ప్రభు యేసు చూపిన దారి
పరమందు సుఖమిడు దారి ||ప్రజ||
2
ఏ జాతి వారల నైన
ఏ దేశ వాసుల నైన
ఏమైన భేదము లేక
యేసయ్య బ్రోచును గాన ||ప్రజ||
3
పాపాత్ములే తన సుతులు
ప్రభు యేసుకు స్నేహితులు
నీ పాపమెల్లను పోవున్‌
నీకింక మోక్షము కలుగున్‌ ||ప్రజ||
4
యేసయ్య గాకను వేరే
యెవరైన లేరిక రారె
దోషంబు లెల్లను బాపి
ఆశీర్వదించును గాన ||ప్రజ||
5
ప్రయాసపడి భారమును
మోసెడి ఓ ప్రజలారా
ప్రభు యేసు క్రీస్తే మీకు
ప్రశాంతి నిచ్చును రండి ||ప్రజ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)