1
పరమును వీడిన ప్రేమ, ధరలో
పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించీ, ఆదరించీ, సేదదీర్చే
నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్య||
2
పావన యేసుని ప్రేమ, సిలువలో
పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి, జీవమిచ్చీ, జయమిచ్చే
తన మహిమ నిచ్చే ||ఆశ్చర్య||
3
నా స్థితి జూసిన ప్రేమ, నాపై
జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించీ ముద్దాడె
కన్నీటిని తుడిచె ||ఆశ్చర్య||
4
శ్రమను సహించిన ప్రేమ, నాకై
శాపము నోర్చిన ప్రేమ
నను విడనాడనీ యెడబాయనీ
ప్రేమదీ వాడబారదు ||ఆశ్చర్య||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)