1
ఎనలేని పాపకూపమున
నేను-తనికి మినుకుచును
నే- దరిఁగానకు డన్‌
కనికరము ఁబెంచి నాయందు
వేగఁ గొనిపోవ నా మేలు
కొరకిందు వచ్చె ||ఈలాటి||
2
పెనుగొన్న దుఃఖాబ్దిలోన
నేను-మునిఁగి కుములుచు నేడు
పునగుందునపుడు
నను నీచుఁడని త్రోయలేక
తనదు నెనరు నా కగు పరచి
నీతిఁజూపించె ||ఈలాటి||
3
నెమ్మిరవ్వంతైన లేక
చింత-క్రమ్మి పొగలుచునుండగా
నన్నుఁజూచి
సమ్మతిని ననుఁబ్రోవదలఁచి
కరముఁజాచి నా-చేయిపట్టి
చక్కగా బిలిచె ||ఈలాటి||
4
పనికిమాలిన వాఁడనైన
నేను-కనపరచు నాదోష
కపటవర్తనము
మనసు నుంచక తాపపడక
యింత-ఘనమైన రక్షణ-మును
నాకుఁజూపె ||ఈలాటి||
5
నా కోర్కెలెల్ల సమయములన్‌
క్రింది-లోక వాంఛల
భ్రమసి లొంగెడు వేళన్‌
చేర్చి దృఢము చిత్తమునన్‌
శుభము-నాకొసంగెజీవింప
నా రక్షకుండు ||ఈలాటి||
6
శోధనలు ననుఁజుట్టినపుడు
నీతి-బోధ నా మనసులోఁ
బుట్టించి పెంచి
బాధ లెల్లను బాపి మాపి
యిట్టి యాదరణఁజూపెనా
యహహ యేమందు ||ఈలాటి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)