1
సాతాను బంధాలలో
జీవపు డంబాలలో
పడనీయక దరి చేరనీయక
తన కృపలో నిరతంబు నను నిల్పెను
2
సత్యంబు జీవంబును
ఈ బ్రతుకు సాఫల్యము
నేర్పించెను నాకు చూపించెను
వర్ణించగా లేను ఆ ప్రభువును
3
కల్వరిగిరి పైనను
ఆ సిల్వ మరణమును
నాకోసమే ప్రభు శ్రమ పొందెను
నా పాపమంతటిని క్షమియించెను
4
ఘనమైన ఆ ప్రేమకు
వెలలేని త్యాగంబుకు
ఏమిత్తును నేనేమిత్తును
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)