1
నీ ఆయువు నాలోచించుము
నీ బ్రతుకును ఆలోచించుము
నీ పాప ఫలితమెపుడో
బహు భయంకర నరకమయా||తరు||
2
నీ పాపపు పరుగులతో
ప్రళయాగ్నిలో చేరెదవా
పరలోకపు మార్గమును
తిరస్కారము చేసెదవా ||తరు||
3
నీ కొరకై శ్రీ యేసు
ఆ సిలువలో బలియాయెన్‌
నీ రక్షణ గోరి సదా
సువార్తను వినిపించెన్‌ ||తరు||
4
ప్రభు యేసుని రక్తములో
పరిశుద్ధుడవై ధరలో
పరమానందము నొందన్‌
త్వరపడిరా ప్రార్థింపన్‌ ||తరు||
5
కృప కాలము దాటగనే
అపాయపు దినములలో
మనుజాళికి మహ శ్రమలు
కనిపించదు ఆశ్రయము ||తరు||
6
నీ దేవుని సన్నిధిలో
కనబడుటకు సిద్ధపడుమా
నేడే రక్షణ దినము
లోక కీడును విడచి రమ్ము ||తరు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)