1
సంతోషం ఎక్కడ వుందని
సమాధాన మెచ్చట నాకు దొరికేనని
జగమంతా వెదికాను
జనులందరి నడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||
2
ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమ అనేది ఎచట నాకు దొరికేనని
బంధువులలో వెతికాను
స్నేహితులను అడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||
3
సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్య జీవమనేది ఎచట నాకు దొరికేనని
ఎందరికో మ్రొక్కాను
ఏమేమో చేశాను
చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||
4
నెమ్మదనేది ఎక్కడ ఉందని
శాంతనేది ఎక్కడ నాకు దొరికేనని
దిశలన్ని తిరిగాను
యాత్రలెన్నో చేశాను
చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)