1
చిన్న చూపుచూచి తమ్ముని
కన్నెరుంగక చంపినగాని
అన్న కయీను దేవుని
హస్తమునకు దొరికినరీతిగా ||దొరు||
2
వరములొందిన తమ్ముని జంప
వలయునని పంతము పగబట్టి
నరకవచ్చి లోబడి ఏడ్చిన
దురిత చరితుని ఏశావువలె ||దొరు||
3
విగ్రహమునకు మ్రొక్కనిదైవ
పిల్లల నగ్నిలో పడవైచి
ఆగ్రహించిన నెబుకద్నెజరు
గడ్డి మేసి దొరికిన విధముగ ||దొరు||
4
చెడుగుచేసి పరులు దానిని
చేసినారని చెప్పియున్న
వడిగ దేవుని న్యాయమనెడి
పరమ త్రాసులో నిలువబడి ||దొరు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)