1
సేవచేయుచుంటి వటంచు
సంతసించు చుంటివేమో
కొయ్యకాలు కఱ్ఱ గడ్డి
కాలురీతిగా నున్నదేమో ||విశ్వాసి||
2
పదిమంది కన్యకలేమో
పిలువబడిరి పెండ్లి విందుకు
పోలేక పోయి రందు
ఐదుగురు అజాగ్రత్తచే ||విశ్వాసి||
3
మునుపున్న రీతిగానే
నేడుంటినని సంసోను
యెరుగలేక దేవుని విడుపు
పొందెనోయి అంధత్వమును ||విశ్వాసి||
4
విస్తారమగు పనులెన్నో
వేసికొనియె మన మార్తమ్మ
ఉత్తమమగు దారిలో
నున్నావో లేదో నీవు ||విశ్వాసి||
5
నీ విధిని మరచి నీవు
పాతిపెట్టి నావ తలాంతు
దొంగ వచ్చినట్లు వచ్చి
దండించు నేమో నిన్ను ||విశ్వాసి||
6
నీ జీవిత లక్ష్యమేమి
నీకున్నదీక్ష యేమి
గురిలేని పోరాటములో
గడచు చుండె నేమో కాలం ||విశ్వాసి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)