1
పరమును విడిచిన ఆ బాలుడు
పశు పాకలో పుట్టెను ఈ రాత్రిలో
మరి వెళ్ళుదమా జోల పాడుదమా
మన ప్రభువును గూడి ఆడుదమా
2
గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి
మ్రొక్కి బంగరు బోళములర్పించిరి
సమర్పించెదమా మన హృదయములన్‌
సద్దేవుని చూచి వచ్చెదమా
3
కిన్నెర వీణెల రావంబులు
గుడి గంటల గజ్జెల శబ్దంబులు
మహానందముతో నుప్పొంగుచును
సద్భక్తుని చూచి వచ్చెదమా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)