1
ఘోరమైన సిలువ
భారంబును నీవు
భరియించి మోసినావు
మా కొరకు-బాధలే బొందినావు ||ఘోర||
2
దుష్టజనులు నిన్ను
దూషణములాడుచు
దుష్టుడే బొడవగాను
నీ ప్రక్క-రుధిరంబు నీరు గారె ||ఘోర||
3
కలువరి గిరి పైన
సిలువ బాధయు నొంది
కలవరము నొందినావు
నా కొరకు-కష్టములు బొందినావు ||ఘోర||
4
కడలి పైన నీవు
కడు నేర్పుతో నుండి
ఒడలు నర్పించినావు
నీ యొక్క వేడుకను జూపినావు ||ఘోర||
5
మూడు గంటల వేళ
యేడు మాటలు బలికి
గోడున జెందినావు
నీ యొక్క ప్రాణంబు విడిచినావు ||ఘోర||
6
పరమధాముం డేసు
మరణమొందగ జూచి
సూర్యుండు చీకటాయె
మృతులైన-పరిశుద్ధులు లేచిరి ||ఘోర||
7
కరుణగల మా యేసు
మరణమొందగ జూచి
ధరగిరుల పగిలినవా
మా తండ్రి-గుడితెరలు చిరిగినవా ||ఘోర||
8
రండి రండి మీరు
రక్షకుని నమ్మండి
నిండు శాంతము నిచ్చును
మా తండ్రి-దండి దయను జూపును

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)