1
నీ ప్రేమ రుచియించిననాడే
నన్ను నేను మరచితినయ్యా
నీ ప్రేమధికమయ్యా నా పై
నీ ప్రేమధికమయ్యా ||ప్రేమా||
2
పరలోక ప్రశస్తరాజా
ప్రేమతో నేతెంచినావా
ప్రేమ తెలియగలనా నీ ప్రేమ
లోతు నెరుగగలనా ||ప్రేమా||
3
ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను
గాంచక తిరిగితినయ్యా
ప్రేమతో నా ప్రియుడా నన్ను
కౌగలించితివే ||ప్రేమా||
4
ఇహలోక సకల మహిమ
పువ్వులవలె వాడిపోవున్‌
వాడదే అయ్యా నీ ప్రేమ
వాడిపోదయ్యా ||ప్రేమా||
5
నీ ప్రేమ మాధుర్యమును
వివరింప తరమౌనే నాకు
అతి సులభముగానే పరమున
వివరించగలను ||ప్రేమా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)